దర్జీ వృత్తి (టైలరింగ్) అంటే ఆనాటి రోజుల్లో ఒక వెలుగు వెలిగిందని, ప్రస్తుతం రెడీమేడ్ వస్త్రాల వ్యవస్థ రావడంతో దర్జీ వృత్తి క్రమేణా మసకబారుతు వస్తోందని గాంధీ కస్తూరిబా ఆదర్శ మహిళ కేంద్రం కుట్టు మిషన్ శిక్షణ ఉపాధ్యాయులు దుర్గ రత్నమాల అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో గాంధీ కస్తూరిబా ఆదర్శ మహిళ కేంద్రంలో జాతీయ కుట్టు యంత్రం దినోత్సవాన్ని నిర్వహించి 8 మందిని సత్కరించారు. రత్నమాల మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం శుభాకార్యాలు, పండుగలు వస్తున్నాయంటే దర్జీలకు చేతినిండా పని ఉండేదని, పల్లెల్లో పట్టణాల్లో దర్జీలను ఎంతో ఆదరించేవారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దుర్గాబాయి దేశ్ ముఖ్ స్థాపించిన ఆదర్శ మహిళా సంఘాల్లో భీమవరం గాంధీ కస్తూరిబా ఆదర్శ మహిళ కేంద్రం ఒకటని, 15 ఏళ్లుగా కుట్టు మిషన్లు శిక్షణ అందిస్తున్నారని అన్నారు. ఈ కేంద్రంలో 42 మంది శిక్షణ పొందుతున్నారని అన్నారు. అనంతరం దర్జిలైన భీమవరం పట్టణ ట్రైలర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు శివకవి సాంబమూర్తి, కార్యదర్శులు త్రినాధ్, ఎన్ రామ కోటేశ్వరరావు, దుర్గ రత్నమాల మరో నలుగురిని సత్కరించారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ మహిళ కేంద్రం గాంధీ కస్తూరిబా మహిళ కేంద్రం
8 మంది కుట్టు మిషన్లదారులకు సత్కారం
భీమవరం :

Archives
Categories
Meta
Calender
Useful Links
Recent Posts
విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించే కార్యక్రమం
July 28, 2026ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందజేత.
July 28, 2026ఆదర్శ మహిళ కేంద్రం గాంధీ కస్తూరిబా మహిళ కేంద్రం
July 28, 2026Categoris
Meta
Calendar