• Home
  • ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందజేత.

ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందజేత.

July 28, 2026 ramya 0 Comments

భీమవరం :

విద్యకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో భీమవరంలో దాతలు ముందుకు వస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా భీమవరంలో ఎంతో మంది దాతలు చదివిస్తున్నారని, వారంతా ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) అన్నారు. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థికి ఉచితంగా సైకిల్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరంకు దాతలు కొదవలేదని, పేద విద్యార్థులకు సహకారం అందించడం దాతలు ఎల్లప్పుడూ ముందు ఉంటున్నారని, దాతల సేవలు ఎనలేనివని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ చినరంగనిపాలెం మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న మిత్తిరెడ్డి కవ్యకు దాతలు సరిపిడకల రామకృష్ణ సౌజన్యంతో ఉచితంగా సైకిల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించామని అన్నారు. ఇటువంటి ప్రతిభ కలిగిన విద్యార్థులకు సహకారం ఎప్పుడు అందిస్తూనే ఉంటామని అన్నారు. కార్యక్రమంలో మైలబత్తుల ఐజాక్ బాబు, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, చెల్లబోయిన గోవింద్, కొండ్రు శ్రీనివాస్, వబిలిశెట్టి రామకృష్ణ, పులపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

leave a comment